Current Affairs Telugu Daily

ఘనంగా అంతర్జాతీయ కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభం
బ్రహ్మకుమారీస్, బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‍లోని రవీంద్ర భారతిలో ప్రారంభమైన అంతర్జాతీయ కల్చరల్ ఫెస్టివల్ ఆహుతులను విశేషంగా అలడించింది. శుక్రవారం ఏడు దేశాల నుంచి వచ్చిన సుమారు 50 మంది కళాకారులు చూడముచ్చటైన వేషాధారణతో నృత్య ప్రదర్శనలు చేశారు. రష్యా, మలేసియా, ఇండోనేషియా అర్మేనియా, ఉక్రెయిన్, అజర్ బైజాన్, బెలారస్ దేశాలకు చెందిన కళాకారులు కార్నివాల్ ఆఫ్ లివింగ్ ప్లవర్స్ పేరుతో బతుకమ్మ పాటలు పాడి ఆడారు. కళల ద్వారా శాంతి సమైఖ్యత వ్యాప్తి అనే అంశంపై ఈ నృత్య ప్రదర్శన జరిగింది. దీనికి బ్రహ్మకుమారి బీకే సంతోష్ నేతృత్వం వహించారు. ఈ ఫెస్ట్‌వల్ నగరంలో 3 రోజులపాటు జరుగనుంది. ఈ సందర్భంగా కళాకారులను మంత్రి చందూలాల్, టూరిజం సెక్రటరీ బుర్రా వేంకటేశం, సాంస్కృతిక డైరెక్టర్ మామిడి హరికృష్ణలు సత్కరించారు. బతుకమ్మ పుట్టుపుర్వోత్తరాలు పుస్తకాల మంత్రి ఆవిష్కరించారు.
views: 1390

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams