Current Affairs Telugu Daily

నౌకాదళంలోకి INS కల్వరి జలాంతర్గామి ప్రవేశం 
స్కార్పీన్‌ శ్రేణిలోని తొలి జలాంతర్గామి INS కల్వరిని ప్రధానమంత్రి నరేంద్రమోడి 2017 డిసెంబర్‌ 14న ముంబయిలో నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ప్రభుత్వం తెచ్చిన భారత్‌లో తయారీ కార్యక్రమానికి ఇది అద్భుత ఉదాహరణ అని పేర్కొన్నారు. దేశ రక్షణ సన్నద్ధతలో పెద్ద ముందడుగని పేర్కొన్నారు. స్కార్పీన్‌ శ్రేణిని ఫ్రాన్స్‌కు చెందిన డీసీఎన్‌ఎస్‌ డిజైన్‌ చేసింది. శత్రువులకు ఆచూకీ చిక్కకుండా గోప్యంగా పనిచేసుకుపోయే ఈ జలాంతర్గాములను సాంకేతిక పరిజ్ఞాన బదిలీ కింద ముంబయిలోని మజ్గావ్‌ డాక్‌ లిమిటెడ్‌లో నిర్మిస్తున్నారు. 
- ఈ ప్రాజెక్టులో భాగంగా 6 జలాంతర్గాములను రూపొందిస్తారు. ఇందులో మొదటిదానికి.. హిందు మహాసముద్రంలో సంచరించే టైగర్‌ సొరచేప పేరును ఖారారు చేశారు. ఈ జలాంతర్గామిని మోడి నౌకాదళం చేతికి అప్పగించారు. 
- దీనికి నరేంద్రమోడి SAGAR (సెక్యూరిటీ అండ్‌ గ్రోత్‌ ఫర్‌ ఆల్‌ ఇన్‌ ద రీజియన్‌- ఈ ప్రాంతంలోని అందరికీ భద్రత, అభివృద్ధి)గా నామకరణం చేశారు. 
SAGAR – Security and Growth for All in the Region

views: 1027

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams