Current Affairs Telugu Daily

అంతర్జాతీయ జ్ఞాపకశక్తి పోటీలో తెలుగు విద్యార్థినుల ప్రతిభ
చైనాలోని షంజన్‌ నగరంలో 2017 డిసెంబర్‌ 6 నుంచి 8 వరకు జరిగిన 26వ అంతర్జాతీయ జ్ఞాపకశక్తి పోటీల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థినులు సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిత్యసాయి చరిష్మ మొదటి స్థానంలో నిలిచారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లికి చెందిన అక్కాచెల్లెళ్లు కనకమహాలక్ష్మి, కల్యాణలక్ష్మి వరుసగా 2, 4 స్థానాల్లో నిలిచారు. మొత్తం 103 దేశాల నుంచి 302 మంది పాల్గొన్న ఈ పోటీల్లో చైనా ప్రథమ, మంగోలియా ద్వితీయ, మలేషియా తృతీయ, భారత్‌ నాలుగు, మకావ్‌ అయిదు స్థానాలు దక్కించుకొన్నాయి. 
views: 965

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams