Current Affairs Telugu Daily

నిశ్శబ్ద ప్రాంతంగా అమర్‌నాథ్‌ గుహ : NGT
అమర్‌నాథ్‌ గుహను నిశ్శబ్ద ప్రాంతంగా పాటించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్‌(NGT) 2017 డిసెంబర్‌ 13న ఆదేశించింది. జమ్ము-కశ్మీర్‌లోని మంచుకొండల్లో ఉన్న ఈ గుహలో ఏటా జూన్‌, జులై, ఆగస్టు నెలల్లో సహజసిద్ధంగా ఏర్పడే మంచులింగాన్ని దర్శించడం కోసం ఐదారు లక్ష మంది భక్తులు వస్తుంటారు. వారికి భోజన, వసతి సౌకర్యాల కల్పన కోసం వందలాది శిబిరాలు, భక్తులను తరలించడం కోసం గుర్రాలు, డోలీలు అందుబాటులో ఉంటాయి. భండారా శిబిరాల నుంచి నిరంతరంగా పెద్దశబ్దంతో లౌడ్‌ స్పీకర్లు మోగుతూనే ఉంటాయి. గుహను సందర్శించినప్పుడు భక్తులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుంటారు. వీటన్నింటి కారణంగా పెద్దఎత్తున శబ్ద కాలుష్యం ఏర్పడుతోందని, ఏటా ఇన్ని లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శిస్తుండడంతో సున్నిత ప్రాంతాలైన హిమాలయాల్లో పర్యావరణానికి హాని జరుగుతోందనే వాదను ఉన్నాయి. వాటన్నింటిపైనా పర్యావరణ ఉద్యమకర్త గౌరీ మౌలేఖి చేసిన అభ్యర్థనపై NGT ట్రైబ్యునల్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ ఈ ఆదేశాలు ఇచ్చారు. గుహలో మంత్రాలు చదవకూడదు, గంటలు మోగించకూడదని, కొబ్బరికాయలు కొట్టకూడదని కూడా ఆదేశించారు. హిమపాతాలను, ధ్వని కాలుష్యాన్ని నివారించడానికి వీలుగా గుహలను నిశ్శబ్ద ప్రాంతంగా ప్రకటించాలని ఎన్‌జీటీ ఇదివరకే సూచించింది. తాజగా మరికొన్ని ఆంక్షలు విధించింది. పవిత్రగుహ లోపలకు సెల్‌ఫోన్లు, కొబ్బరికాయల వంటివాటిని  అనుమతించవద్దని, మెట్లు మొదలయ్యే చోటు నుంచి గుహ లోపలి వరకు మొత్తం ప్రాంతాన్ని నిశ్శబ్దం పాటించాల్సిన ప్రదేశంగా ప్రకటించాలని ట్రైబ్యునల్‌ తెలిపింది. భక్తులు హిమలింగాన్ని మరింత బాగా దర్శించుకునేందుకు వీలుగా ఆలయం లోపల ఉన్న ఇనుప కడ్డీలు, ఇతర అడ్డుకట్టలను తొలగించాలని సూచించింది. 
NGT-National Green Tribunal

views: 924Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams