Current Affairs Telugu Daily

రామసేతు మానవ నిర్మితమేనని ‘వాట్‌ ఆన్‌ ఎర్త్‌’ ఛానల్‌ వెల్లడి
రామసేతు మానవ నిర్మితమేనా? సీతను విడిపించేందుకు రాముడే దీనిని కట్టాడా? అసలు నిజంగా ఈ వంతెన ఉందా? లాంటి ప్రశ్నలతో ‘‘రామసేతు గాథ’’ మరోసారి వార్తల్లో నిలిచింది. 
రామసేతు మానవ నిర్మితమేనని డిస్కవరీకి చెందిన సైన్స్‌ ఛానెల్‌ ‘వాట్‌ ఆన్‌ ఎర్త్‌’వెల్లడించింది. ‘వాట్‌ ఆన్‌ ఎర్త్‌’ పేరిట నిర్వహిస్తోన్న ప్రత్యేక కార్యక్రమంలో రామసేతు గురించి ప్రసారం చేయనున్నట్లు ప్రోమో విడుదల చేసింది. నాసా ఉపగ్రహ చిత్రాలు, పురాతత్వ శాస్త్రవేత్త పరిశోధన ఆధారంగా రామసేతు మానవ నిర్మితమేనని ఛానెల్‌ దీనిలో చెబుతోంది. రామసేతు పొడవు దాదాపు 30 మైళ్లు. ఇది తమిళనాడులోని పంబన్‌ దీవి, శ్రీలంకలోని మన్నార్‌ దీవులను కలుపుతోంది. ఇసుక తిన్నెపై సున్నపు రాళ్లను జతచేసినట్లు కనిపించే ఈ నిర్మాణాన్ని శాస్త్రీయ కోణంలో పరిశోధకులు విశ్లేషించారు. ఇక్కడి ఇసుక తిన్నొలు సహజమైనవేనని, కానీ దానిపై రాళ్లు మాత్రం వేరొకచొటి నుంచి తీసుకొచ్చారని తేల్చారు. దీని కోసం రాళ్లు, ఇసుక వయసును నిర్ధారించే పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. దీంతో రాళ్లు 7,000 ఏళ్లనాటివని తేలిందని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త చెల్సియా రోస్‌ తెలిపారు. ఇసుక తిన్నొ మాత్రం నాలుగు వేల ఏళ్లనాటివని గుర్తించినట్లు వివరించారు. అంతేకాదు ఈ వంతెన దాదాపు ఐదు వేల ఏళ్ల కిత్రం నిర్మించి ఉండొచ్చని అంచనావేశారు. మరోవైపు భారతదేశం,  లంకలను కలిపేందుకు శ్రీరాముడు ఈ వంతెనను నిర్మించాడనే విశ్వాసాన్నీ దీనిలో ప్రముఖ భూగర్భ శాస్త్రవేత్త డా.అలాన్‌ లెస్టెర్‌ ప్రస్తావించారు.
- రామసేతుపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. మంచుయుగం నాడు భారత్‌, శ్రీలంకను ఇది కలిపేదని కొందరు చెబుతుంటే.. శ్రీలంక, భారత్‌ ఒకప్పుడు కలిసేవుండేవని, 1,25,000 ఏళ్ల కిత్రం ఇవి విడిపోయాయని మరికొందరు వివరిస్తున్నారు. 
- రావణుడి చెర నుంచి సీతను విడిపించేదుకు శ్రీరాముడు దీన్ని నిర్మించినట్లు రామాయణం చెబుతోంది. సేతు సముద్రం ప్రాజెక్టుపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు ప్రస్తుతం ఇక్కడ వంతెనే లేదని యూపీఏ ప్రభుత్వం కొట్టిపారేసింది.
- ప్రస్తుతం మన దేశ తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి నౌక చేరుకోవాలంటే శ్రీలంకను చుట్టిరావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణ సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా సేతు సముద్రం ప్రాజెక్టును యూపీఏ-1 తెరపైకి తెచ్చింది. రామసేతు గుండా పడమ ప్రయాణించేలా దీనిలో ప్రాజెక్టు ప్రతిపాదించారు. దీంతో దాదాపు 350 నాటికల్‌ మైళ్ల ప్రయాణ సమయం కలిసి వస్తుందని అంచనా. దీన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో వరుస పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై 2008లో సుప్రీం విచారణ చేపట్టింది. అసలు ఈ వంతెన మానవ నిర్మితమా? కాదో తేల్చాలని భారత చారిత్రక పరిశోధన మండలి (ఐసీహెచ్‌ఆర్‌)కి బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఈ విషయంపై పరిశోధన సాగుతోంది.

views: 1183

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams