Current Affairs Telugu Daily

జీశాట్ - 18 ప్రయోగం సక్సెస్
భారత సమాచార సేవలను మరింత వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఉపగ్రహం జీశాట్ - 18 ప్రయోగం విజయవంతమైంది. ఫ్రెంచ్ గయానాలలోని (దక్షిణ-అమెరికా) కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి గురువారం ఈ ప్రయోగం జరిగింది. దీని ద్వారా రానున్న రోజుల్లో టీవీ, టెలికమ్యూనికేషన్స్, వీశాట్, డిజిటల్ ఉపగ్రహ వార్తాసేకరణ వంటి విషయాల్లో విప్లవాత్మక మార్పులు అందుబాటులోకి రానున్నాయి. వాతావరణం సహకరించక పోవటంతో ప్రయోగం ఒకరోజు ఆలస్యమైన సంగతి తెలిసిందే. గురువారం తెల్లవారు జామున 2 గం. ప్రాంతంలో యురోపియన్ లాంచర్ ఏరియన్ - 5 వీఏ - 231కౌరు కేంద్రం నుంచి బయలు దేరింది. 32 నిమిషల తర్వాత ఆస్ట్రేలియా ఆపరేటర్ SBN కు సంబంధించిన స్కై మస్టర్ - 2 ను ఉపగ్రహన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. కాసేపటికే అత్యంత శక్తివంతమైన జీశాట్ -18 ను కూడా కక్ష్యాలోకి పంపించింది. భూసిర్థ కక్ష్యలోకి ప్రవేశించిన ఈ జీశాట్ - 18 మాస్టర్ కంట్రోలింగ్ కమాండ్ కర్ణాటకలోని హసన్ నుంచి జరుగనుంది.
views: 1033

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams