సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ సామాజిక సంస్కరణలను కొనసాగిస్తున్నారు. దేశంలో నాలుగు దశాబ్దాల కిందట సినిమా ప్రదర్శనలపై విధించిన నిషేధాన్ని 2017 డిసెంబర్ 11న ఎత్తివేశారు. దీంతో చలన చిత్రాలకు అనుమతుల మంజూరు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత 35 ఏళ్లుగా ఉన్న నిషేధం తొలగడంతో తొలిసారిగా 2018లో వాణిజ్య సినిమాల ప్రదర్శన ప్రారంభం కానుంది.
- సినిమాలు నైతిక విలువలను మంటగలుపుతాయని, సాంస్కృతిక, మత విశ్వాసాలకు విఘాతం కలిగిస్తాయన్న ఛాందసవాదుల ఆందోళనల నేపథ్యంలో 1980ల్లో వీటిపై నిషేధం విధించారు.
views: 1049