Current Affairs Telugu Daily

క్రిస్టియానో రొనాల్డోకు గోల్డెన్‌ బాల్‌ అవార్డు
ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడికి ఇచ్చే ప్రతిష్టాత్మక బంగారు బంతిని పొర్చుగల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో దక్కించున్నాడు. క్రిస్టియానో రొనాల్డో ఈ అవార్డును దక్కించుకోవడం ఇది 5వసారి. దీంతో అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన ఆటగాడిగా మెస్సి సరసన నిలిచాడు. ప్రపంచంలోని 176 దేశాలకు చెందిన ఫుట్‌బాల్‌ విలేకరులు ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకున్నారు. మొత్తం 946 పాయింట్లతో క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలవగా, మెస్సి 670 పాయింట్లతో రెండో స్థానం, నెయ్‌మార్‌ 361 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. గత ఏడాది కూడా బంగారు బంతిని క్రిస్టియానో రొనాల్డో దక్కించుకున్నాడు. అప్పుడు కూడా రెండో స్థానంలో మెస్సి ఉన్నాడు. ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఫుట్‌బాల్‌ ఆటగాడికి బంగారు బంతిని బహూకరిస్తారు. గత పదేళ్లుగా మెస్సి లేదంటే రొనాల్డోనే ఈ అవార్డును దక్కించుకుంటున్నారు.
- గోల్డెన్‌ బాల్‌ అవార్డును ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాగజైన్‌ ప్రకటిస్తుంది. 
- ఏడాదిలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్ల నుంచి ఫుట్‌బాల్‌ జర్నలిస్టులు ఓటింగ్‌ ద్వారా అవార్డు విజేతను ఎన్నుకుంటారు. 
- 1956లో ఈ అవార్డును ప్రవేశపెట్టారు. 
- తొలుత యూరోపియన్‌ ఆటగాళ్లకు మాత్రమే బహూకరించేవారు. 
- 2007 నుంచి ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తున్నారు. 
-  2010లో ఫిపా ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ మ్యాగజైన్‌ సంయుక్తంగా అవార్డును ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాయి. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు రెండు సంస్థలు కలిసి ఉత్తమ ఆటగాడిని ఎంపిక చేశాయి. 
- ఆ తర్వాత రెండింటి మధ్య బంధం తెగింది. ఫ్రాన్స్‌ మ్యాగజైన్‌ బంగారు బంతిని ఇస్తుండగా.. ఫిపా ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును ప్రకటిస్తోంది. ఈ ఏడాది ఈ రెండు పురస్కారాలను రొనాల్డోనే అందుకున్నారు. 

views: 1032

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams