Current Affairs Telugu Daily

వాసెనార్‌ కూటమిలో భారత్‌కు సభ్యత్వం 
అత్యంత కీలకమైన ఎగుమతి నియంత్రణ వ్యవస్థ వాసెనార్‌ ఏర్పాటు(వాసెనార్‌ అరేంజ్‌మెంట్‌-WA)లో భారత్‌ 42వ సభ్య దేశంగా ఎంపికైంది. భారతదేశానికి సభ్యత్వం కల్పిస్తూ ‘వాసెనార్‌ ఏర్పాటు’ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను సముపార్జించుకోవడానికీ వీలు కలుగనుంది. వియెన్నాలో జరిగిన WA ప్లీనరీ సమావేశం భారత్‌ను 42వ సభ్య దేశంగా ప్రకటించింది. 
అవసరమైన లాంఛనాలన్నీ పూర్తికాగానే ఈ సభ్యత్వం లభిస్తుందని వివరించింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(NPT)లో సంతకం పెట్టనప్పటికీ అణువ్యాప్తిని నిరోధించడంలో భారత్‌కున్న పేరు ప్రతిష్టను ఇది ఇనుమడిరపచేస్తుంది. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదిరినప్పటి నుంచి అణు సరఫరాదారుల బృందం(NSG), క్షిపణి పరిజ్ఞాన నియంత్రణ వ్యవస్థ(MTCR), వాసెనార్‌ ఏర్పాటు, ఆస్ట్రేలియా గ్రూప్‌ వంటి ఎగుమతి నియంత్రణ కూటముల్లో ప్రవేశానికి భారత్‌ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. సంప్రదాయ, అణు, జీవ, రసాయన ఆయుధాలు, వాటి పరిజ్ఞానాలను ఈ కూటములు నియంత్రిస్తున్నాయి. ఈ సభ్యత్వం వల్ల NSGలో భారత ప్రవేశానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.. ఈ కూటమిలోకి ప్రవేశించకుండా చైనా అడ్డుకుంటోంది. మరో కూటమి MTCRలో సభ్యత్వాన్ని 2016 జూన్‌లో భారత్‌ దక్కించుకుంది.
WA-Wassenaar Arrangement
NPT-Non-Proliferation Treaty
NSG-Nuclear Suppliers Group
MTCR-Missile Technology Control Regime

views: 927

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams