Current Affairs Telugu Daily

ఆన్‌లైన్‌ కంటే ఆఫ్‌లైన్‌ చదువుకే యువత మొగ్గు
అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో వార్తల వెబ్‌సైట్‌లు, యాప్‌లు చాలానే అందుబాటులో ఉన్నప్పటికీ వార్తాపత్రికను చదివేందుకే యువత ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని బ్రిటన్‌లో అధ్యయనమొకటి తేల్చింది. లండన్‌లోని సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ లండన్‌ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వార్త వెబ్‌సైట్లు, యాప్‌తో పోలిస్తే వార్తాపత్రిక పఠనానికి యువత దాదాపు రెట్టింపు సమయాన్ని కేటాయిస్తున్నట్లు గుర్తించామన్నారు. 2016లో బ్రిటన్‌లోని 8 జాతీయ వార్తాపత్రికను చదివేందుకు 18-34 ఏళ్లమధ్య వయసున్న వ్యక్తులు మొత్తంగా 2,170 కోట్ల నిమిషాలు వెచ్చించారని తెలిపారు. అవే పత్రిక వెబ్‌సైట్లు, యాప్‌పై 1,190 కోట్ల నిమిషాలే గడిపారని పేర్కొన్నారు. 18-34 ఏళ్లమధ్య వయసున్న పాఠలకు మామూలు రోజుల్లో సగటున 23 నిమిషాల చొప్పున వార్తాపత్రికను చదువుతున్నారని వెల్లడించారు. శని, ఆదివారాల్లో ఈ సమయం మరింత ఎక్కువగా ఉంటోందన్నారు. అంతే వయసున్న పాఠకులు.. అవే వార్తాపత్రికలకు చెందిన వెబ్‌సైట్లు, యాప్‌లకు రోజుకు సగటున 43 సెకన్లు మాత్రమే కేటాయిస్తున్నారని వివరించారు.
views: 987

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams