Current Affairs Telugu Daily

కక్ష్యలోని శకలాలతో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌
అంతరిక్షంలో నిరుపయోగంగా పడి ఉన్న ఒక రాకెట్‌ దశను చైనా శాస్త్రవేత్తలు ఒక స్మార్ట్‌ అప్లికేషన్‌ ప్రోగ్రామ్‌గా మార్చారు. ఇందుకోసం అందులో మేథో చిప్‌ను అమర్చారు. 2017 నవంబర్‌లో చైనా లాంగ్‌మార్చ్‌ 4సి రాకెట్‌ ద్వారా ఫెంగ్యున్‌ 3డీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ రాకెట్‌లోని తుది దశలో అనేక ఇంటెలిజెంట్‌ చిప్‌ను షాంఘైకు చెందిన ఫుడాన్‌ విశ్వవిద్యాలయం అమర్చింది. ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టాక సాధారణంగా ఆ రాకెట్‌ భాగం వ్యర్థంగా పడి ఉంటుంది. అంతరిక్షంలోని వ్యర్థాలల్లో ఇటువంటి భాగాలదే సింహభాగం. వీటిలో తెలివైన చిప్‌ల ఏర్పాటు వల్ల చౌకలో సైన్స్‌ ప్రయోగాలకు, కమ్యూనికేషన్‌ వేదికు గాను ఉపయోగించుకోవడానికి వీలవుతుందని పరిశోధనలో పాలుపంచుకున్న జెంగ్‌ లిరాంగ్‌ తెలిపారు. వివిధ వస్తువులను నెట్‌తో సంధానించే ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌(IoT)ను ఇప్పటికే రోజువారీ జీవితాల్లో ఉపయోగిస్తున్నారు. శరీరంపై ధరించే స్మార్ట్‌ పరికరాలు, డ్రైవర్‌రహిత వాహనాలు, జీపీఎస్‌ పరిశీలనలో పశువులను మేపడం వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుత అప్లికేషన్లలో డేటా రద్దీ, మందగమనం వంటి సమస్యలు ఉన్నాయి. మారుమూల ప్రాంతాల్లో ఇది మరీ ఎక్కువ. తాజా అంతరిక్ష ఆధారిత నెట్‌వర్క్‌ వల్ల ఈ ప్రాంతాల్లో మెరుగ్గా ఐవోటీ సేవలందించవచ్చు.
IoT-Internet of things

views: 881

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams