Current Affairs Telugu Daily

చైనా విదేశీ పెట్టుబడుల్లో భారత్‌ ర్యాంక్‌ 37
చైనా విదేశీ ప్రత్యక్ష పెటుబడుల విషయంలో భారత్‌ 37వ స్థానంలో నిలిచింది. 60 దేశాలకు సంబంధించి చైనా గోయింగ్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఇండెక్స్‌-2017ను 2017 డిసెంబర్‌ 7న ఎకనమిస్ట్‌ ఇంటలిజెన్స్‌ యూనిట్‌ విడుదల చేసింది. దీని ప్రకారం చైనా పెట్టబడుల్ని ఆకర్షించే విషయంలో అమెరికాను 2వ స్థానానికి నెట్టి, సింగపూర్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. హాంకాంగ్‌, మలేషియా, ఆస్ట్రేలియాలు మూడు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ఆటోమొబైల్‌ వినియోగ వస్తువు, ఎనర్జీ ఫైనాన్షియల్‌ సేవలు, హెల్త్‌ కేర్‌ రంగాలు ఈ ఇండెక్స్‌ పరిధిలో ఉన్నాయి. 
జాబితా
1    సింగపూర్‌
2    అమెరికా
3    హాంకాంగ్‌
4    మలేషియా
5    ఆస్ట్రేలియా 

views: 913



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams