Current Affairs Telugu Daily

స్వలింగ వివాహాలకు ఆస్ట్రేలియాలో చట్టబద్ధత
స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లును ఆస్ట్రేలియన్‌ పార్లమెంట్‌ ఆమోదించింది. ఈ బిల్లును ఇంతకుముందు పార్లమెంట్‌ ఎగువసభ సెనేట్‌ ఆమోదించగా 2017 డిసెంబర్‌ 7న కాన్‌బెర్రాలో సమావేశమైన ప్రతినిధుల సభ (దిగువ సభ) ఆమోదం తెలిపింది. తాజా చట్టం ప్రకారం ఇకపై స్వలింగ సంపర్కు తమ వివాహానికి నోటీస్‌ దాఖలు చేయవచ్చు. నోటీస్‌ దాఖలు చేసిన 30 రోజుల తర్వాత వివాహం చేసుకోవచ్చు.
- ఆస్ట్రేలియా ప్రధాని : మాల్కం టర్న్‌బుల్‌ 

views: 1045



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams