Current Affairs Telugu Daily

అత్యంత శృంగార ఆసియా మహిళగా ప్రియాంకచోప్రా 
ప్రపంచంలోనే అత్యంత శృంగార ఆసియా మహిళగా ప్రియాంకచోప్రాకు జనం ఐదోసారి నీరాజనాలు పలికారు. లండన్‌ కేంద్రంగా వెలువడే వారపత్రిక ‘ఈస్ట్రన్‌-ఐ’ ఏటా నిర్వహించే ప్రతిష్టాత్మక ఆన్‌లైన్‌ పోల్‌-2017లో అత్యధిక ఓట్లు ప్రియాంకను వరించాయి. నిరుడు (2016లో) ఈ ఖ్యాతిని సొంతం చేసుకున్న దీపికా పదుకొనె ఈసారి 3వ స్థానానికే పరిమితమయ్యారు. ఆన్‌లైన్‌ ఓటింగ్‌ ద్వారా మొత్తం 50 మంది అత్యంత శృంగార మహిళను ఈస్ట్రన్‌-ఐ ఎంపిక చేసింది. ప్రియాంకచోప్రా అంతర్జాతీయ బుల్లితెర కార్యక్రమం క్వాంటికోలో పాల్గొంటున్నారు. భారతీయ బుల్లితెర నటి నియాశర్మ 2వ స్థానంలో నిలిచింది. ఎంపికైనవారిలో అత్యంత పిన్న వయస్కురాలు 19 ఏళ్ల టీవీ నటి శివాంగీ జోషి(16వ స్థానం) కాగా, అత్యంత పెద్ద వయస్కురాలు 54 ఏళ్ల శ్రీదేవి (49వ స్థానం).
జాబితా
1    ప్రియాంకచోప్రా
2    నియాశర్మ
3    దీపికా పదుకొనె
4    ఆలియాభట్‌ 
5    మాహిర్‌ ఖాన్‌ (పాకిస్తానీ నటి)
6    ద్రష్టిధామీ 
7    కత్రినా కైఫ్‌ 
8    శ్రద్ధా కపూర్‌
9    గౌహర్‌ఖాన్‌
10    రుబీనా దిలోక్‌

views: 955



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams