పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ‘మీ టూ’
లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన ‘సైలెన్స్‌ బ్రేకర్స్‌’ను టైమ్‌ మ్యాగజైన్‌ ఈ ఏడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ప్రకటించింది. హాలీవుడ్‌ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్‌ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో సినీ ప్రపంచం కుదుపునకు లోనైంది. హార్వేపై ఆరోపణలు చేసిన వారితో పాటు, లైంగిక దాడులకు గురయ్యామని ప్రపంచ వ్యాప్తంగా ‘మీ టూ హ్యాష్‌ట్యాగ్‌’ ద్వారా తమ బాధను పంచుకున్న మహిళందరినీ సైలెన్స్‌ బ్రేకర్స్‌గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ‘పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2వ స్థానంలో నిలిచారు.
views: 892

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams