హైదరాబాద్‌ మెట్రో స్మార్ట్‌ కార్డులపై 10% రాయితీ
హైదరాబాద్‌ మెట్రో స్మార్ట్‌ కార్డు వినియోగదారులకు ఎల్‌అండ్‌టీ సంస్థ 10% రాయితీని ప్రకటించింది. 2018 మార్చి 31 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. పేటీఎం ద్వారా తొలిసారి రీచార్జ్‌కు రూ.100, ఆపైన రీచార్జ్‌ చేసుకుంటే రూ.20 క్యాష్‌బ్యాక్‌ అందిస్తారు. స్టేషన్‌లోని టికెటింగ్‌ కార్యాలయాల నుంచి స్మార్ట్‌ కార్డులు కొనుగోలు చేయడంతో పాటు ఏదైనా మెట్రో స్టేషన్‌లో వాటిని రీచార్జ్‌ చేసుకోవచ్చు. టీ సవారీ యాప్‌, పేటీఎం, హెచ్‌ఎంఆర్‌ ప్యాసింజర్‌ వెబ్‌సైట్‌, స్టేషన్‌ పెయిడ్‌ ఏరియాలోని యాడ్‌ వల్యూ మెషీన్‌ ఉపయోగించి స్మార్ట్‌ కార్డును రీచార్జ్‌ చేసుకోవచ్చు. 
- ఆటోమేటిక్‌ ఫేర్‌ కలెక్షన్‌(ఏఎఫ్‌సీ) వ్యవస్థ పనితీరు పరీక్షించేందుకు ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ బృందం ఫేక్‌ టోకెన్స్‌ను టెస్ట్‌ టోకెన్స్‌గా వినియోగిస్తుంది. ఇవి ఒరిజినల్‌ టోకెన్స్‌తో కలసి ఉంటాయి. వీటిని తర్వాత కాలంలో సిస్టమ్‌ నుంచి తొలగిస్తారు.

views: 661
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.