మైసూరు రాజ వంశానికి వారసుడు వచ్చాడు. మైసూరు రాజవంశస్థుడు యదువీర్ కృష్ణరాజ ఒడెయరు, త్రిషికా దేవి దంపతులకు 2017 డిసెంబర్ 6న బెంగళూరులో మగబిడ్డ జన్మించాడు. మైసూరు రాజవంశంలో ఐదున్నర దశాబ్దాల తరువాత మగబిడ్డ జననం ఇదే ప్రథమం. 1956 ఫిబ్రవరి 20న శ్రీకంఠదత్త ఒడెయరు జన్మించారు. అదే రాజప్రాసాదంలో చివరి మగ సంతానం. మహారాజు శ్రీకంఠ దత్త ఒడెయరు- భార్య ప్రమోదాదేవిలకు సంతానం లేదు. రెండేళ్ల క్రితం ఒడెయరు మృతి చెందారు. ప్రమోదాదేవి తన సోదరి నుంచి యదువీర్ను దత్తత పొందారు. యదువీర్, త్రిషికాదేవిలకు 2016 జూన్ 27న వివాహమైంది.
views: 1088