భారత సంతతి వ్యక్తులపై అమెరికా పోలీసు వివక్ష
భారత సంతతి వ్యక్తులపై అమెరికా పోలీసులు తీవ్ర వివక్ష చూపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అమెరికాలో వివక్ష పేరుతో అక్కడి నేషనల్‌ పబ్లిక్‌ రేడియో, మరికొన్ని సంస్థలు కలిసి ఈ సర్వేను చేపట్టాయి. తమను గానీ, తమ కుటుంబ సభ్యలను గానీ పోలీసు అన్యాయంగా నిలిపివేసిన సందర్భాలున్నాయని భారతీయ అమెరికన్లలో 17% మంది సర్వేలో వెల్లడించారు. చైనా సంతతికి చెందిన వారిలో 2% మంది ఇలాంటి వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. మొత్తంగా ఆసియా అమెరికన్లలో 12% మంది పోలీసు నుంచి వివక్షలను ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. 
views: 626
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.