చంద్రుడిపై రోబో స్టేషన్‌ ఏర్పాటు దిశగా చైనా ప్రణాళికలు 
చంద్రుడి భౌగోళిక స్వరూపంపై పరిశోధనలను మరింత వేగవంతం, విస్తృతం చేసే దిశగా చైనా ప్రణాళికలు రచిస్తోంది. ఈ పరిశోధనలకు అనుగుణంగా చందమామపై రోబో స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చంద్రమండలం నుంచి శిల నమూనాలను భూమిపైకి తీసుకొచ్చేందుకు అవుతున్న భారీ వ్యయాన్ని ఈ స్టేషన్‌ ఏర్పాటుతో గణనీయంగా తగ్గించవచ్చునని చైనా భావిస్తున్నట్లు స్థానిక వార్తాసంస్థ ఓ కథనంలో వెల్లడించింది. రోబో స్టేషన్‌లో పెద్ద సౌరవిద్యుత్తు ఉత్పత్తి యంత్రాన్ని ఏర్పాటు చేస్తారని.. ఫలితంగా చంద్రుడిపై ఇప్పుడున్న రోవర్ల కంటే రోబో శక్తి సామర్థ్యాలు మెరుగ్గా ఉంటాయని తెలిపింది. సంక్లిష్ట పరిశోధనను సైతం వేగంగా పూర్తిచేసేందుకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. మరోవైపు, అంగారక గ్రహంపై పరిశోధనకు గాను 2020 లోగా లాంగ్‌మార్చ్‌ 5 ప్రాజెక్టును చేపట్టేందుకు చైనా సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఓ రోవర్‌ను చైనా అంగారకుడిపై మోహరిస్తుంది.
views: 684
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.