Current Affairs Telugu Daily

సూపర్‌ భూమి కే2-18బీపై జీవజాలం 
భూమికి 111 కాంతి సంవత్సరాల దూరంలో తిరుగుతున్న ఓ గ్రహంపై జీవం ఉండే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. సూపర్‌ భూమి (కే2-18బీ)గా పిలుస్తున్న ఈ గ్రహం ఓ మరుగుజ్జు నక్షత్రం (కే2-18) చుట్టూ తిరుగుతోంది. ఇది లియో తారా మండలంలో ఉంది. 2015లోనే ఖగోళ నిపుణులు దీన్ని గుర్తించారు. అయితే ఇది శిలా గ్రహమా? లేదా వాయు గ్రహమా? అని తెల్చడంపై కెనడాలోని టొరంటో వర్సిటీ నిపుణులు దృష్టిసారించారు. దీని కోసం యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ(ఈఎస్‌వో) సమాచారాన్ని వారు విశ్లేషించారు. కే2-18బీ ద్రవ్యరాశి భారీగా ఉంది. పైగా ఇది కే2-18 ఆవాసయోగ్య పరిధిలో ఉంది. 
views: 854

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams