మహారాష్ట్రలో లావాదేవీలు మరాఠీలోనే నిర్వహణ
మహారాష్ట్రలోని కేంద్ర ప్రభుత్వ కార్యాయాలు, సంస్థలు, కార్పొరేషన్‌లు, ప్రభుత్వరంగ కార్యాలయాల్లో అన్ని కార్యాకలాపాలను మరాఠీ భాషలోనే నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం 2017 డిసెంబర్‌ 5న నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నోటిఫికేషన్‌ ప్రకారం ఇక్కడ జరిగే బ్యాంకింగ్‌, టెలిఫోన్‌, తపాలా, బీమా, రైల్వే, మెట్రో, మోనో-రైల్‌, విమాన సర్వీసులు, వంటగ్యాసు, పెట్రోలియం ఇలా అన్ని రకాల కార్యకలాపాల్లోనూ మరాఠీ భాషనే వినియోగించాలి. ఈ విభాగాలన్నిటిలో వివిధ పోస్టులు భర్తీకి నిర్వహించే పరీక్షల్లో మరాఠీ భాషను, దేవనాగరి లిపిని, వాటితో పాటు ఇంగ్లిషు, హిందీ భాషలను వాడాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. అన్నిరకాల మౌఖిక, లిఖితపూర్వక లావాదేవీలను మరాఠీభాష, దేవనాగరి లిపిలోనే ఉండేలా చూడాంది. బహిరంగ నోటీసు, సూచనలు, నోటీసు బోర్డు, సూచికలు...చివరకు నేమ్‌ప్లేట్లను కూడా ఇవే భాషల్లో ఉండేలా చూడాంది. 
- అన్ని బ్యాంకింగ్‌ లావాదేవీలూ మరాఠీ భాషలోనే జరగాలన్న డిమాండ్‌తో మహారాష్ట్ర నవనిర్మాణ సేన్‌(ఎంఎన్‌ఎస్‌) ఉద్యమం ప్రారంభించింది.

views: 745

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams