కులాంతర వివాహం ద్వారా సామాజిక సమగ్రతకు డాక్టర్‌ అంబేద్కర్‌ పథకానికి కేంద్రం మార్పు లు
కులవిబేధాలను రూపుమాపే దిశగా కులాంతర వివాహాలను ప్రోత్సహించే క్రమంలో అంతకుముందున్న ఓ పథకాన్ని కేంద్రం ఇప్పుడు సవరించింది. అందులో పేర్కొన్న వార్షికాదాయ పరిమితి నిబంధనను తొలగించింది. తాజా సవరణ ప్రకారం... ఇకపై కులాంతర వివాహం చేసుకునేవారిలో ఒకరు దళితులై ఉంటే...వారికి రూ.2.5 లక్షలు కేంద్రం నుంచి ప్రోత్సాహకంగా లభిస్తాయి. ఈ మేరకు 2013 నాటి సంబంధిత పథకానికి(కులాంతర వివాహం ద్వారా సామాజిక సమగ్రతకు డాక్టర్‌ అంబేద్కర్‌ పథకం) కేంద్రం మార్పు చేసింది. రూ.5 లక్షలకు మించని వార్షికాదాయం ఉన్నవారికి మాత్రమే కులాంతర వివాహం చేసుకున్నప్పడు ఈ పథకం కింద ప్రోత్సాహకాన్ని అందచేసేవారు. ఇప్పుడా వార్షికాదాయ పరిమితి నిబంధననను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. 
- హిందూ వివాహ చట్టం(1955) ప్రకారం ఈ కులాంతర వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టరు చేయాలి. 
- ద్వితీయ వివాహం చేసుకునే వారికి ఈ నిబంధన వర్తించదు.

views: 645
Vyoma Current Affairs
e-Magazine
November-2017
DETAILS


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams

© 2017   vyoma online services.  All rights reserved.