ఎలక్ట్రానిక్స్‌ లేకుండానే వైఫైతో అనుసంధానం
ఎలాంటి ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు అవసరం లేకుండానే ఇంటర్నెట్‌తో అనుసంధానమయ్యే కొత్తరకం 3డీ ప్లాస్టిక్‌ పదార్థాలను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వీటిలో ప్రత్యేక సెన్సర్‌లు ఉపయోగించారు. ఇవి వైఫై సంకేతాలను అందిపుచ్చుకొని ఇతర స్మార్ట్‌ పరికరాలతో ఇట్టే అనుసంధానం అవుతున్నాయి. వాణిజ్య అవసరాలకు అనుగుణంగా ఈ పరిజ్ఞానాన్ని తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు అమెరికాలోని వాషింగ్టన్‌ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఎక్ట్రానిక్‌ ఉపకరణాలు నిర్వర్తించే విధులను స్ప్రింగ్‌లు, స్విచ్‌లు, గేర్లు లాంటి 3డీ పరిజ్ఞానంతో ముద్రించగలిగే ఉపకరణా యాంత్రిక చర్యతో తాము భర్తీ చేయగలిగినట్లు తెలిపారు.
views: 767

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams