రెరా రాజ్యాంగబద్ధమేనని బాంబే హైకోర్టు తీర్పు
స్థిరాస్తి(అభివృద్ధి, నియంత్రణ) చట్టం-రెరా రాజ్యాంగబద్ధమేనని 2017 డిసెంబర్‌ 6న బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. దేశవ్యాప్తంగా ఫ్లాట్ల కొనుగోలుదారుల ప్రయోజనాలు కాపాడడానికి, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇది ఎంతో అవసరమని పేర్కొంది. రెరా కేంద్ర చట్టమని, స్థిరాస్తి వ్యవహారాలు రాష్ట్రాల పరిధిలో ఉంటాయని, అందువల్ల దీని అమలుపై సమన్వయం అవసరమని సూచించింది. ఈ చట్టం రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు వ్యాజ్యాలపై జస్టిస్‌ నరేశ్‌ పాటిల్‌, జస్టిస్‌ రాజేశ్‌ కేట్కర్‌లు తీర్పును వెలువరించారు.
RERA-Real Estate Regulatory Agency

views: 822

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams