Current Affairs Telugu Daily

జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తించిన అమెరికా 
పవిత్ర నగరమైన జెరూసలెంను ఇజ్రాయెల్‌ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 2017 డిసెంబర్‌ 6న ప్రకటించారు. ప్రస్తుతం టెల్‌అవీవ్‌ నగరంలో ఉన్న అమెరికా రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించాలని అధికారులను ఆదేశించారు. 2016లో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఈ చర్య తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అరబ్‌ దేశాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. జెరూసలేంలోని తూర్పు ప్రాంతాన్ని ఇజ్రాయెల్‌ ఆక్రమించిందని భావిస్తున్న చాలా దేశాలు తమ రాయబార కార్యాలయాలను  టెల్‌అవీవ్‌లోనే నిర్వహిస్తున్నాయి. 
views: 820

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams