Current Affairs Telugu Daily

పారిస్ ఒప్పందానికి భారత్ ఆమోదం
గతేడాది పారిస్‍లో చేసుకున్న పర్యావరణ ఒప్పందానికి ఆదివారం భారత్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతకం చేసిన ఒప్పందం ఆమోద ప్రతిని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ యూఎన్ ఒప్పందాల విభాగ చీఫ్ విల్లపాండోకు అందజేశారు. మహాత్మాగాంధీ 147వ జయంతి సందర్భంగా యూఎన్ అదికారులు దౌత్యవేత్తల్తో కలిసి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దీన్ని అందించారు. ఈ ఒప్పందం వల్ల వాతావరణంలో కీలక మార్పులకు తొలి అడుగుపడనుందని ఒప్పందంపై ప్రపంచ దేశాలను ఏకం చేయటంలో భారత్ కీలకంగా వ్యవహరించిందని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్‍కీ మూన్ ప్రశంసించారు.
views: 989

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams