Current Affairs Telugu Daily

ఆసు యంత్రం రూపకర్త చింతకింది మల్లేశానికి రూ.కోటి సాయం 
చేనేత వస్త్రాల తయారీని సులభతరం చేసేందుకు వీలుగా రూ.కోటి రూపాయలతో 650 ఆసు యంత్రాలను తయారు చేయించి, కార్మికులకు పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే యంత్రాల రూపకర్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశానికి రూ.కోటి చెక్కును రాష్ట్ర చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్‌ 2017 డిసెంబర్‌ 5న అందజేశారు. 
- మల్లేశం తన తల్లి లక్ష్మి పేరిట వస్త్రాలను నేసేందుకు వీలుగా లక్ష్మి ఆసు యంత్రాలను తయారు చేశారు. దీనికి గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చింది. 
- తాను కనిపెట్టిన యంత్రాలను మరిన్ని తయారు చేసి రాష్ట్రమంతటా పంపిణీ చేసేందుకు ప్రోత్సాహం కల్పించాలని మల్లేశం మంత్రి కేటీఆర్‌ను కోరారు. దీనిపై ఆయన స్పందించి మల్లేశానికి తమ శాఖ ద్వారా రూ.కోటిని అందజేశారు. 

views: 1126

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams