Current Affairs Telugu Daily

సూపర్‌సోనిక్‌ క్షిపణి ఆకాశ్‌ పరీక్ష విజయవంతం 
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే సూపర్‌సోనిక్‌ క్షిపణి ఆకాశ్‌ను భారత్‌ 2017 డిసెంబర్‌ 5న విజయవంతంగా పరీక్షించింది. 25 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ అస్త్రంలో తొలిసారిగా స్వదేశీ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్‌ను ఉపయోగించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ పరీక్ష జరిగింది. ఇందులో మానవరహిత విమానాలన్ని ఈ క్షిపణి లక్ష్యంగా చేసుకుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను నేలకూల్చే ఎలాంటి అస్త్రాన్నైనా రూపొందించే సామర్థ్యం భారత్‌ సొంతమైంది. 
- ఆకాశ్‌ వ్యవస్థ యుద్ధవిమానాలు, క్రూయిజ్‌, బాలిస్టిక్‌ క్షిపణులను నేలకూల్చగలదు. 
- ఏకకాలంలో బహుళ లక్ష్యాలను నాశనం చేయగలదు. 
- ఆకాశ్‌ క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) రూపొందించింది. 
DRDO-Defence Research and Development Organisation

views: 942



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams