Current Affairs Telugu Daily

యెమెన్‌ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్ హత్య
అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న యెమెన్‌లో ఆ దేశ మాజీ అధ్యక్షుడు అలీ అబ్దుల్లా సలేహ్(75)ను హతమార్చినట్లు హుతి తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలో నెలకొన్న సంక్షోభం ముగిసిందని సలేహ్, ఆయన మద్దతుదారుల్ని హతమార్చినట్లు తిరుగుబాటుదారుల అధీనంలోని  అల్‌-మసీరా చానెల్‌ పేర్కొంది. 
- 3 దశాబ్దాల పాటు యెమెన్‌ను పాలించిన సలేహ్ అరబ్‌ విప్లవం నేపథ్యంలో 2012లో ఉద్వాసనకు గురయ్యారు. 
- అనంతరం యెమెన్‌ అధ్యక్షుడైన మన్సూర్‌ హదీకి వ్యతిరేకంగా హుతి తిరుగుబాటుదారులతో చేతులు కలిపారు. దీంతో దేశంలో అంతర్యుద్ధం రాజుకుంది. 
- ప్రాణభయంతో హదీ సౌదీ అరేబియాకు పారిపోవడంతో సలేహ్ హుతి రెబల్స్‌తో కలిసి మూడేళ్ల కిత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కానీ ఇరువర్గాల మధ్య విభేదాలు తలెత్తడంతో సలేహ్ హుతి రెబల్స్‌ నుంచి విడిపోయారు.

views: 981

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams