Current Affairs Telugu Daily

భారత అంధుల క్రికెట్‌  కెప్టెన్‌ అజయ్‌కుమార్‌రెడ్డి 
2018 జనవరి 7న ప్రారంభమయ్యే అంధుల క్రికెట్‌ ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టుకు అజయ్‌కుమార్‌రెడ్డి (ఆంధ్రప్రదేశ్‌) సారథిగా వ్యవహరించనున్నాడు. పాకిస్థాన్‌, దుబాయ్‌ల్లో జరిగే ఈ టోర్నీలో ఆతిథ్య పాకిస్థాన్‌తో పాటు భారత్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడనున్నాయి. పుణెలో ఎంపిక శిబిరాలన్ని నిర్వహించిన భారత అంధుల క్రికెట్‌ సంఘం.. 56 మంది ఆటగాళ్ల నుంచి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేసింది. 
జట్టు: అజయ్‌కుమార్‌రెడ్డి (కెప్టెన్‌), జాఫర్‌ ఇక్బాల్‌., నరేశ్‌, మహేందర్‌, సోను గోల్కర్‌, ప్రేమ్‌ కుమార్‌, బసప్ప, వెంకటేశ్వరరావు, మధుకర్‌, సుర్జిత్‌, అనిల్‌ గరియా, ప్రకాశ్‌ జయరామయ్య, దీపక్‌ మలిక్‌, సునీల్‌ రమేశ్‌, దుర్గారావు, పంకజ్‌, రామ్‌బీర్‌

views: 1017

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams