Current Affairs Telugu Daily

భూకంపాల తీవ్రతను వేగంగా అంచనావేసే కొత్త పద్ధతి
గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా భూకంపాల తీవ్రతను వేగంగా అంచనావేసే కొత్త పద్ధతిని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ప్రస్తుతం భూకంప కేంద్రం నుంచి బయటకు వచ్చే తరంగా ఆధారంగా ప్రకంపన తీవ్రతను పరిశోధకులు లెక్కిస్తున్నారు. భూకంపం వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తిలో మార్పు కనిపిస్తాయి. వీటిపై దృష్టి కేంద్రీకరిస్తే వేగంగా ప్రకంపన తీవ్రత తెస్తుందని అమెరికాలోని కాలిఫోర్నియా, ఫ్రాన్స్‌లోని డిడెరాట్‌ నిపుణులు గుర్తించారు. 2011లో జపాన్‌లోని టోహోకు భూకంప సమయంలోని పరిస్థితులను వారు విశ్లేషించారు. దీంతో భూకంప తరంగాలు సెకనుకు మూడు నుంచి 10 కి.మీ. దూరం ప్రయాణిస్తే గురుత్వాకర్షణ సంకేతాలు కాంతి వేగంతో దూసుకువస్తున్నాయని కనిపెట్టారు.
views: 1263



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams