Current Affairs Telugu Daily

బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌ మృతి
బాలీవుడ్‌ నటుడు శశికపూర్‌(79) 2017 డిసెంబర్‌ 4న ముంబయిలో మృతిచెందారు. ప్రఖ్యాత బాలీవుడ్‌ తొలితరం పృథ్వీరాజ్‌ కపూర్‌ కుమారుడైన శశికపూర్‌ 1938 మార్చి 18న జన్మించారు. నాలుగేళ్ల వయసులోనే తన తండ్రి నాటక సంస్థలో బాలనటుడిగా నట ప్రస్థానం ప్రారంభించారు. ఆపై సినీరంగంలో ప్రవేశించి సహాయ దర్శకుడిగా, కథానాయకుడిగా తనదైన ముద్ర వేశారు. 1961లో వచ్చిన ‘ధర్మపుత్ర’ చిత్రంతో కథానాయకుడి పాత్రను ప్రారంభించిన ఆయన నట ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగింది. దాదాపు 116కు పైగా చిత్రాల్లో కథానాయకుడిగా నటించిన ఆయన 1970, 80ల్లో రొమాంటిక్‌ పాత్రల్లో తనదైన నటనతో యువతను ఉర్రూతలూగించారు. 2011లో శశికపూర్‌ను పద్మభూషణ్‌ పురస్కారం వరించగా, 2015లో దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన దీవార్‌, కభీ కభీ, నమక్‌ హలాల్‌, కాలా పత్తర్‌ తదితర చిత్రాలు ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి.
views: 884

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams