Current Affairs Telugu Daily

దేశవ్యాప్తంగా మొత్తం రూ. 65,250 కోట్ల నల్లదనం బహిర్గతం
దేశంలో నల్లధనాన్ని వెలికి తీసే క్రమంగా మోధీ ప్రభుత్వ ప్రారంభించిన ఆదాయ వెల్లడి పథకానికి (ఐడీఎస్) భారీ స్పందన లభించింది. పన్ను చెల్లించని ఆదాయాన్ని స్వచ్చందంగా చేప్పెందుకు ప్రభుత్వం విధించిన గడువు sep 30 నాటికి భారీగా రూ. 65,250 కోట్ల నల్లదనం వెలుగు చూసింది. ఇందులో రూ. 29,362 కోట్లు పన్నుల రూపంలో ఖజానాకు చేరుకున్నాయి. ఈ మొత్తంలో రూ. 14,700 కోట్లు ఈ ఆర్థిక చేరుకున్నాయి. ఈ మొత్తంలో రూ. 14,700 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో సమకురుతాయి. ఈ పథకంలో 64,275 మంది తమ అక్రమ ఆదాయాన్ని బయట పెట్టారు. సగటున ఒక్కొక్కరు రూ. కోటి ఆదాయాన్ని వెల్లడించారు. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం మీడియాకు వెల్లడించారు. అయితే ఈ మొత్తంలో అత్యధిక వాటా హైదరాబాద్‍దే కావడం విశేషం. శుక్రవారం సాయంత్రం నాటికి హైదరాబాద్ నుంచి దాదాపు రూ. 13 వేల కోట్ల అప్రకటిత అదాయం వెల్లడైందని ఐటీ వర్గాల సమాచారం మిగతా స్థానాల్లో ముంభై (రూ. 4 వేలకోట్లు) ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రకటించిన ఆదాయ వెల్లడి పథకాల్లో అత్యంత విజయవంతమైన పథకం ఇదేనని ఈ ఘనత ప్రధాని మోధీకి చెందుతుందని జైట్లీ పేర్కొన్నారు.
views: 971

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams