Current Affairs Telugu Daily

‘బంధన్‌ తోడ్‌’ యాప్‌తో బాల్యవివాహం రద్దు
13 ఏళ్ల ఓ చిన్నారిని బాల్యవివాహం నుంచి బంధన్‌ తోడ్‌ యాప్‌ చివరి నిమిషంలో తప్పించింది. ఆమెను చేసుకోవసి ఉన్న 15 ఏళ్ల మైనర్‌ కుర్రాడికి కూడా ఆ పెళ్లిబాధ తప్పిపోయింది. హిందీలో ఉన్న ఈ యాప్‌ ద్వారా దర్భంగాకు చెందిన ఆ బాలిక చివరి నిముషంలో ఎస్‌వోఎస్‌ను పంపింది. పట్నా కేంద్రంగా పనిచేస్తున్న జెండర్‌ అయెన్స్‌కు ఈ యాప్‌ ద్వారా ఎస్‌వోఎస్‌ చేరింది. దాంతో వాళ్లు వెంటనే పట్నా డీజీపీని సంప్రదించారు. ఆయన స్థానిక పోలీసు అధికారులను అప్రమత్తం చేశారు. చివరకు ఆ బాల్య వివాహం కాస్తా రద్దయింది. జెండర్‌ అయెన్స్‌ సంస్థే ఈ యాప్‌ను సెప్టెంబరులో ప్రవేశపెట్టింది.
views: 1238

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams