Current Affairs Telugu Daily

SMSకు పాతికేళ్లు
2017 డిసెంబర్‌ 2తో SMSకి పాతికేళ్లు నిండాయి. సరిగ్గా 1992 డిసెంబర్‌ 2న నీల్‌ పాప్‌వర్త్‌ అనే ఇంజినీర్‌ ప్రపంచంలోనే మొదటి SMSను వొడాఫోన్‌ నెట్‌వర్క్‌పై కంప్యూటర్‌ ద్వారా పంపించాడు. అప్పటి వొడాఫోన్‌ డైరెక్టర్‌ రిచర్డ్‌ జార్విస్‌కు ‘మేరీ క్రిస్మస్‌’ అంటూ అందులో శుభాకాంక్షలు తెలిపాడు. 
- ఆ తర్వాతి ఏడాది నోకియా సంస్థ తమ మొబైల్‌ఫోన్లలో 160 అక్షరాల పరిమితితో కూడిన SMSలు పంపగలిగే సాంకేతికతను జోడించింది. దీంతో SMSలతో ప్రజలు ఊసులు చెప్పుకోవడం మొదలుపెట్టారు. 
- 1999లో ఏ నెట్‌వర్క్‌ వారికైనా SMSలు పంపే సదుపాయం అందుబాటులోకి వచ్చింది. 1990 చివర్లో, 2000ల్లో SMSల హవా నడిచింది. అక్షరాల పరిమితి కారణంగా పదాలకు కొత్తగా పొట్టి స్పెల్లింగ్‌లూ పుట్టుకొచ్చాయి. ఆ తర్వాత వాట్సాప్‌ వంటి సదుపాయా రంగప్రవేశంతో SMSల జోరు తగ్గినా వాటి ఉనికి మాత్రం కొనసాగుతోంది.
SMS-Short Message Service

views: 1101

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams