Current Affairs Telugu Daily

చైనా-మాల్దీవుల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
హిందూ మహాసముద్రంలో భారత్‌కు ఆందోళన కలిగించేలా తన ప్రాబల్యాన్ని చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. ఈ ప్రాంతంలోని మాల్దీవులతో ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనికింద రెండు దేశాలూ దాదాపు 95 శాతం మేర దిగుమతి సరకులపై సుంకాలను పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. భారత భద్రతా ఆందోళనలను బేఖాతరు చేస్తూ మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌ ఈ ఒప్పందంపై 29న సంతకం పెట్టి, హడావుడిగా దానిపై పార్లమెంటు ఆమోదం పొందారు. ఈ క్రమంలో దేశ ప్రజలను, విపక్షాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి. అత్యవసరంగా పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించి, ఆమోద ప్రక్రియను యమీన్‌ ముగించారు. సభలో ప్రవేశపెట్టిన తర్వాత వెయ్యికిపైగా పేజీలున్న ఈ ఒప్పందానికి గంటలోపే ఆమోదం లభించేలా చేశారు. ఒప్పంద పత్రాన్ని పార్లమెంటు సభ్యులకుగానీ, మీడియాకు గానీ ఇవ్వలేదు. మాల్దీవులు ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయింది. ఈ దేశ అప్పుల్లో 70శాతం చైనా నుంచి తీసుకున్నవే.
views: 1128

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams