Current Affairs Telugu Daily

ప్రసార భారతి ఛైర్మన్‌గా మళ్ళీ సూర్యప్రకాశ్‌ 
ప్రసార భారతి బోర్డు ఛైర్మన్‌గా ఎ.సూర్యప్రకాశ్‌ తిరిగి నియమితులయ్యారు. ఆయనకు 70 ఏళ్లు వచ్చే వరకూ (2020 ఫిబ్రవరి 8 వరకూ) ఆ పదవిలో కొనసాగుతారు. ఎంపిక కమిటీ సిఫార్సు మేరకు రాష్ట్రపతి ఈ నియామకం చేపట్టినట్లు ఓ అధికారిక ప్రకటన పేర్కొంది. 2014లో భాజపా సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే సూర్యప్రకాశ్‌ను ప్రసారభారతి ఛైర్మన్‌గా నియమించింది. ఇటీవలే ఆ పదవీకాలం ముగిసింది. 
views: 1057



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams