Current Affairs Telugu Daily

జీఎంఆర్‌కు ‘ద ఎకనామిక్‌ టైమ్స్‌ మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ బిజినెస్‌ లీడర్‌ ఇన్‌ ఆసియా’ అవార్డు
 జీఎంఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంధి మల్లికార్జునరావుకు అంతర్జాతీయ గౌరవం దక్కింది. నవంబరు 29, 30 తేదీల్లో మలేసియాలో నిర్వహించిన ‘ద ఎకనామిక్‌ టైమ్స్‌ ఆసియన్‌ బిజినెస్‌ లీడర్స్‌ కాన్‌క్లేవ్‌’లో ‘ద ఎకనామిక్‌ టైమ్స్‌ మోస్ట్‌ ఇన్‌స్పైరింగ్‌ బిజినెస్‌ లీడర్‌ ఇన్‌ ఆసియా’ అవార్డుతో గ్రంధి మల్లికార్జున రావును మలేసియా ప్రధాన మంత్రి నజీబ్‌ రజాక్‌ సత్కరించారు. ‘టేకింగ్‌ ఆసియా టు గ్లోబ్‌’ థీమ్‌గా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రంధి మల్లికార్జున రావు మాట్లాడుతూ.. సంస్థ , దేశం తరఫున ఈ అవార్డు అందుకోవడం గర్వంగా ఉందన్నారు. తరాల తర్వాత కూడా విజయవంతంగా ఎలా నిర్వహించాలో పాశ్చాత్య, బహుళజాతిసంస్థల నుంచి ఆసియా సంస్థలు నేర్చుకోవాల్సి ఉందన్నారు. దేశ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో తమ సంస్థ మరింత చొరవ చూపిస్తోందని గ్రంధి మల్లికార్జునరావు తెలిపారు.
views: 1275

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams