Current Affairs Telugu Daily

హైదరాబాద్‌ బిర్యానీకి ‘ఆదిమహోత్సవ్‌’ అవార్డు
 హైదరాబాద్‌ బిర్యానీకి మరోసారి జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా గిరిజనులను ఏకం చేసేలా కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా పక్షం రోజులుగా దిల్లీలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఆది మహోత్సవ్‌’ కార్యక్రమంలో హైదరాబాద్‌ బిర్యానీ వంటకాల్లో తొలిస్థానం పొందింది. ఆదిమహోత్సవ్‌లో భాగంగా అన్ని రాష్ట్రాల ఆహారాలను దిల్లీహాత్‌లో ప్రదర్శించారు. తెలంగాణ నుంచి హైదరాబాద్‌ బిర్యానీ స్టాల్‌ను అశోక్‌కుమార్‌ రమావత్‌ ఏర్పాటుచేశారు. అన్నిరాష్ట్రాల వంటకాల్లోనూ హైదరాబాద్‌ ధమ్‌ బిర్యానీ తొలిస్థానంలో నిలిచింది. కేంద్రమంత్రి జుయెల్‌ఓరమ్‌ చేతులమీదుగా అశోక్‌ అవార్డు అందుకున్నారు.
views: 1150

Current Affairs Telugu
e-Magazine
October-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams