Current Affairs Telugu Daily

‘హఫీజ్‌కు  మద్దతుదారుడిని’ ముషారఫ్
ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్‌ సయీద్‌, అతడి ఉగ్రసంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ)లకు తాను అతిపెద్ద మద్దతుదారుడినని పాకిస్థాన్‌ మాజీ నియంతృత్వ పాలకుడు పర్వేజ్‌ ముషారఫ్‌ అన్నారు. కశ్మీర్‌లో భారత సైన్యాన్ని ఒత్తిడికి గురిచేయడంలో ఎల్‌ఈటీది ప్రధాన పాత్ర అని.. అందుకు తానెప్పుడూ సానుకూలంగా ఉన్నానని చెప్పారు. ఎల్‌ఈటీ, హఫీజ్‌ నడుపుతున్న జమాతేఉద్‌దవా సంస్థ కూడా తనను ఇష్టపడుతాయని ముషారఫ్‌ అన్నారు. పాక్‌లో ఎల్‌ఈటీని నిషేధిస్తూ గతంలో నిర్ణయం తీసుకున్నది ముషారఫ్‌ ప్రభుత్వమే.
views: 1059



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams