మ్యాగీ నూడిల్స్‌లో అధిక యాష్
మ్యాగీ నూడిల్స్‌పై మరో వివాదం నెలకొంది. ఉత్పత్తుల్లో అనుమతికి మించిన సీసం ఉంటోందని గతంలో బయటపడడంతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి రేగిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఉత్పత్తిలో బూడిద (యాష్‌) స్థాయి ఎక్కువగా ఉంటోందంటూ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌ జిల్లా ఆహార-ఔషధ నియంత్రణాధికారులు గుర్తించారు. దీనికిగానూ రూ.71 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా మ్యాగీ తయారీదారులైన నెస్లే ఇండియాకు, ఇతర భాగస్వాములకు ఆ అధికారులు లీగల్‌ నోటీసు పంపించారు. 2016 నవంబరులో సేకరించిన నమూనాలను విశ్లేషించినప్పుడు విషయం బయటపడింది. ప్రస్తుతం మనుగడలో లేని పాత ప్రమాణాల ప్రకారం నాణ్యత పరీక్షలు నిర్వహించడం వల్లనే ఇలా జరిగినట్లు నెస్లే ఇండియా ఒక ఆంగ్ల దినపత్రికకు తెలిపింది. ఆహారపదార్థాల్లో బూడిద స్థాయిపై స్పష్టత లేక అయోమయం తలెత్తిందని సంబంధిత వర్గాలు అంటున్నాయి.
views: 864

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams