Current Affairs Telugu Daily

హ్వాసంగ్‌-15 క్షిపణి ప్రయోగం ఉత్తర కొరియా
 అమెరికాలోని మూలమూలనూ తాకే శక్తిమంతమైన విధ్వంసక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి(ఐసీబీఎం)ను విజయవంతంగా పరీక్షించామని ఉత్తర కొరియా నవంబర్ 29న ప్రకటించింది. ‘‘అణు శక్తి’’గా ఎదగాలన్న తమ చిరకాల వాంఛ నెరవేరిందని తెలిపింది. దాదాపు 13,000 కి.మీ. పరిధిలోని ప్రాంతాలపై దాడిచేయగల హ్వాసంగ్‌-15 తరహా క్షిపణిని ఉత్తర కొరియా ప్రయోగించింది. ఇది 950 కి.మీ. ప్రయాణించి జపాన్‌ జలాల్లో పడింది. ప్రయోగానంతరం ఉత్తర కొరియా నాయకుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తాజా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఉత్తర కొరియాను కట్టడిచేయడంపై... దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్‌ జేఇన్‌, జపాన్‌ ప్రధాని షింజో అబేలతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అత్యవసరంగా ఫోన్లో విడివిడిగా చర్చలు జరిపారు. పరిస్థితులను తాము చక్కదిద్దుతామని ఆయన చెప్పారు. మరోవైపు జపాన్‌ అభ్యర్థనపై ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ) అత్యవసరంగా సమావేశం అయ్యేందుకు అంగీకరించింది.
views: 1150



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams