Current Affairs Telugu Daily

భారత్‌-సింగపూర్‌ రక్షణ ఒప్పందం
రక్షణ రంగంలో మరింతగా సహకరించుకోవాలని నవంబర్ 29న భారత్‌-సింగపూరలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ప్రధానంగా నౌకా రంగంలో సహకారాన్ని పెంపొందించుకోనున్నాయి. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఒప్పందానికి ప్రాధాన్యం ఏర్పడింది. సింగపూర్‌ రక్షణ శాఖ మంత్రి ఎన్‌గ్‌ ఇంగ్‌ హెన్‌, భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ల మధ్య చర్చలు జరిగాయి. భారత యుద్ధ నౌకలు తమ నౌకా స్థావరాల్లో ఇంధనం నింపుకోవడానికి అవకాశం కల్పిస్తామని సింగపూర్‌ మంత్రి చెప్పారు. దీనివల్ల మలక్కా జలసంధి, సమీప ప్రాంతాల్లో భారత నౌకలు కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు కలుగుతుంది. దక్షిణ చైనా సముద్రంలో నౌకలు తిరగడానికి స్వేచ్ఛ ఉండాలని రెండు దేశాలూ డిమాండు చేశాయి. ఉగ్రవాదాన్ని అణచివేత, రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకరించుకోవాలని నిర్ణయించాయి.
views: 982

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams