Current Affairs Telugu Daily

డిల్లీలో  ‘స్వర్ణ’ రైలు పెట్టెల ఆవిష్కరణ 
 సరికొత్త హంగులతో, అధునాతనంగా తీర్చిదిద్దిన ‘స్వర్ణ’ రైలు పెట్టెలను నవంబర్ 29న కొత్తదిల్లీ రైల్వేస్టేషన్లో ఆవిష్కరించారు. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ల కోసం ఉద్దేశించిన వీటిని ముందుగా సియాల్దా-దిల్లీ రైల్లో ప్రవేశపెట్టారు. పాడైన, పాతబడిన పెట్టెల్ని సమూలంగా మార్చే ప్రక్రియను కొన్ని రకాల ప్రీమియం రైళ్లతో ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. చూడగానే ఆకట్టుకునేలా పెట్టె లోపలి భాగాలను తీర్చిదిద్దడంతో పాటు మెరుగైన కాంతి కోసం ఎల్‌ఈడీ దీపాలను వీటిలో అమర్చారు. మరుగుదొడ్లలో దుర్గంధం రాకుండా ఏర్పాట్లు చేశారు. స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాష్‌ బేసిన్లను అమర్చారు. రాత్రిపూట కూడా బెర్తుల సంఖ్యలు సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. తలుపుల వద్ద సీసీటీవీ కెమేరాలు ఉంటాయి. మొదటి తరగతి ఏసీ పెట్టెల్లో సులభంగా పైబెర్తులకు చేరుకునేందుకు వీలైన నిచ్చెనలు బిగించారు. ఈ పెట్టెల్ని హౌరా నుంచి బయల్దేరే మరో మూడు రైళ్లలోనూ ప్రవేశపెడతారు.
views: 1127

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams