Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి వరకు తెలుగు తప్పనిసరి
ఆంధ్రప్రదేశ్ లో ఒకటి నుంచి పదో తరగతి వరకు తెలుగు సబ్జెక్టును తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 29 న ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ ఈ మేరకు జీవో  విడుదల చేశారు. ఇక నుంచి అన్ని మాధ్యమాల్లోనూ తెలుగును తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది. తెలుగును మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు రెండో భాషగా హిందీని స్వీకరించాలని, తెలుగేతర బాషను మొదటి భాషగా స్వీకరించిన విద్యార్థులు తెలుగును రెండో భాషగా స్వీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
views: 1243



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams