Current Affairs Telugu Daily

అత్యుత్తమ-50 ఎమ్‌ఐఎమ్‌ వర్సిటీల్లో 3 భారత విద్యాసంస్థలకు చోటు
మాస్టర్స్‌ ఇన్‌ మేనేజ్‌మెంట్‌(ఎమ్‌ఐఎమ్‌) కోర్సులను అందిస్తోన్న అత్యుత్తమ 50 విశ్వవిద్యాలయాల జాబితాలో భారత్‌కు చెందిన 3 విద్యాసంస్థలు చోటు దక్కించుకున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌, కోల్‌కతాలోని ఐఐఎమ్‌లు వరుసగా 22, 23, 46వ స్థానాల్లో నిలిచాయి. ఎంబీఏ కోర్సుకు సంబంధించిన జాబితాలో బెంగళూరు-ఐఐఎమ్‌(49వ ర్యాంకు)కు మాత్రమే అత్యుత్తమ-50లో చోటు దక్కింది. బ్రిటన్‌కు చెందిన క్యూఎస్‌ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌ సంస్థ ఈ జాబితాలను ప్రకటించింది.
views: 1072Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams