Current Affairs Telugu Daily

మిస్‌ యూనివర్స్‌గా డెమీ లీగ్‌ 
దక్షిణాఫ్రికాకు చెందిన డెమి లీగ్‌ నీల్‌ పీటర్స్‌(22) 2017 సం॥నికి గాను మిస్‌ యూనివర్స్‌గా ఎంపికైంది. లాస్‌వెగాస్‌లో జరిగిన అందాల పోటీల్లో పాల్గొన్న 92 మంది అందగత్తెల్లో డెమి లీగ్‌ నీల్‌ పీటర్స్‌ మేటిగా నిలిచింది. కొలంబియాకు చెందిన లారా గొంజాలెజ్‌, జమైకాకు చెందిన డెవీనా బెన్నెట్‌ వరుసగా మొదటి, రెండో రన్నరప్‌లుగా నిలిచారు. మన దేశానికి చెందిన శ్రద్ధా శశిధర్‌ టాప్‌-16లో కూడా చోటు సంపాదించలేకపోయింది. ‘మీరు గర్వకారణంగా భావించే మీలోని ఏ క్షణం అంటే ఇష్టపడతారు?, విశ్వసుందరిగా ఆ క్షణం మీకు ఎలా ఉపకరిస్తుందనుకుంటున్నారు?’ అని న్యాయమూర్తు అడిగిన ప్రశ్నకు డెమి చక్కని సమాధానమిచ్చారు. ‘వ్యక్తిగతంగా, విశ్వసుందరిగా ఆత్మవిశ్వాసంతో వ్యవహరించాలి. విశ్వసుందరి ఎన్నో భయాలను అధిగమించి ఉండి, ఇతర మహిళల భయాలను దూరం చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. ఆమె(విశ్వసుందరి)ని దేని గురించి పెద్దగా అడగనక్కర్లేదు. నేను కచ్చితంగా అలాంటి మహిళనే..’ అన్న డెమి సమాధానం ఆమెను విజేతగా నిలబెట్టింది. వెనెజువెలా, థాయిలాండ్‌కు చెందిన సుందరీమణులు నాలుగైదు స్థానాల్లో నిలిచారు. 
views: 1166

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams