Current Affairs Telugu Daily

15వ ఆర్థిక సంఘం ఏర్పాటు 
పార్లమెంటు మాజీ సభ్యుడు, కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఎన్‌కే సింగ్‌ నేతృత్వంలో 15వ ఆర్థిక సంఘం ఏర్పాటయింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ 2017 నవంబర్‌ 27న ఉత్తర్వులు జారీ చేశారు. 
15వ ఆర్థిక సంఘం పూర్తికాల సభ్యులు 
1. శక్తికాంతదాస్‌, ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి 
2. అనూప్‌సింగ్‌, అమెరికా వాషింగ్టన్‌లోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 
తాత్కాలిక సభ్యులు
1. అశోక్‌ లాహిరి, బంధన్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌  
2. రమేష్‌చంద్‌, నీతిఆయోగ్‌ సభ్యుడు 
కార్యదర్శి : అరవింద్‌ మెహతా 
- 2019 అక్టోబర్‌ 30వ తేదీలోపు ఈ సంఘం నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. 
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులు, లోటు, రుణాల స్థాయి, నగదు నిల్వలు, ఆర్థిక క్రమశిక్షణను సమీక్షించి తగిన సిఫార్సు చేయాల్సి ఉంటుంది. 
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతలను పరిగణలోకి తీసుకొని, సమర్థత, పారదర్శకత పెంపునకు సూచనలు చేయాలి. 
- రెవెన్యూ లోటు భర్తీకి గ్రాంట్లు ఇవ్వాలా? వద్దా? సేవలు మెరుగయ్యేలా స్థానిక సంస్థలకు ఎలా గ్రాంట్లు ఇవ్వాలన్న అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. 
- 2020 ఏప్రిల్‌ 1 తర్వాత అయిదేళ్ల కాలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయి? కేంద్ర, రాష్ట్రాలపై జీఎస్‌టీ సంస్కరణ ప్రభావం ఎంత? తదితర అంశాలపై అధ్యయనం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

views: 1149

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams