ముంబయి దాడు సూత్రధారి, జమాత్ ఉద్ దవా(జేయూడీ) అధినేత హఫీజ్ సయీద్‌ను గృహ నిర్బంధం నుంచి వదిలిపెట్టాని పాకిస్థాన్‌లోని పంజాబ్ న్యాయ సమీక్షా మండలి 2017 నవంబర్ 22న ఆదేశాలు జారీ చేసింది. అతడి నిర్బంధాన్ని మరో 3 నెలలు పొడిగించాలన్న ప్రభుత్వ అభ్యర్థనను తోసిపుచ్చింది. తీర్పు వెలువడిన వెంటనే సయీద్ మళ్లీ నోరు పారేసుకున్నాడు. ‘ఇది నా కేసు కాదు... పాకిస్థాన్‌ది. భారత్ చేసిన ప్రయత్నాలన్నీ విఫమయ్యాయి. నేను విడుదలవుతున్నా.. త్వరలో కశ్మీర్‌కూ స్వాతంత్య్రం వస్తుంది’అంటూ వ్యాఖ్యలు చేశాడు.
- 2017 జనవరి 31న ఉగ్రవాద నిరోధక చట్టం కింద సయీద్ సహా ఐదుగురు ముష్కరులను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. సయీద్‌ను పట్టించినవారికి రూ.65 కోట్లు ఇస్తామని అమెరికా ప్రకటించింది.
views: 1185