Current Affairs Telugu Daily

నరికివేత, తరలింపు అనుమతుల నుంచి 40 రకాల చెట్లకు మినహాయింపు
తెలంగాణ రాష్ట్రంలో 40 రకాల వృక్ష జాతులపై ఉన్న నరికివేత, తరలింపు ఆంక్షను సడలించినట్లు అటవీశాఖ 2017 నవంబర్‌ 22న వెల్లడించింది. ఫలితంగా వ్యవసాయ భూముల్లో వెదురును పెంచేందుకు వీలు కలుగుతుందని పేర్కొంది. వెదురుతో పాటు గుమ్మడిటేకు, యూకలిఫ్టస్‌, సుబాబుల్‌, సీమచింత, తాటి, కొబ్బరి, జీడిమామిడి, నీలగిరి, స్విర్‌ఓక్‌, సీమ తుమ్మ, అశోక, జామ, రెయిన్‌ట్రీ, రబ్బర్‌, క్యాషూ, జామాయిల్‌, రేగు, కానుగ, సీమమర్రి, తెల్లతుమ్మ, కరివేపాకు, మందార, సపోట, నిద్రగన్నేరు, భారత్‌లో పెరగని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కలప ఈ జాబితాలో ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ అడవుల  పెంపకం, తరలింపు నిబంధనలు-1970కి సవరణ చేసింది. దీంతో ఈ జాబితాలోని చెట్లను నరకడానికి అటవీశాఖ నుంచి అనుమతుల కోసం అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఇక ఉండదు. 
- మామిడి చెట్ల విషయంలో మాత్రం షెడ్యూల్‌ ప్రాంతాల, నల్గొండ జిల్లా మినహా తెంగాణలోని ఇతర జిల్లాల్లో మినహాయింపు ఉంటుంది.

views: 1719

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams